మరి నేటి పరిస్థితో ? 3 ఏళ్ళకే బడికి వెళ్ళిపోయే పిల్లాడి దగ్గరనుంచి ,3 తరాలను చూసేసిన ముదుసలి వరకు అదే ఒత్తిడి చూస్తున్నాం ....ప్రపంచీకరణ తీస్కోస్తున్న సంపద తో పాటు ,ఈ ఒత్తిడి దుష్ఫలితాలు కూడా తీస్కోస్తున్నాయి ,ముఖ్యంగా మనస్తత్వ శాస్త్రజ్ఞులు ఈ క్రింది కారణాలు చెప్తున్నారు ఉద్యోగుల్లో ఒత్తిడి కోసం ...
- ఉద్యోగంతో సంతృప్తి లేకపోవడం
- పని భారం
- అధిక పని గంటలు
- ప్రణాళిక లేకపోవడం
- పని చేసే సంస్థ నుంచి సహకారం లేకపోవడం
ఇక విద్యార్ధుల్లో ఒత్తిడి సంగతి చెప్పనే అక్కర్లేదు ,ర్యాంకుల కోసం పెద్దల ఒత్తిడి ,ప్రాణాలు తీసిన సందర్భాలు ఎన్నో ...
ఇలా విద్య ,ఉద్యోగం ,వ్యాపారం ఇలా రంగం ఏదైనా ఈ ఒత్తిడి అనేది ఒక మహమ్మారిగా పరిణమించింది ,కాకపోతే చిన్న చిన్న చిట్కాల ద్వారా అధిగమించవచ్చు అనేది శాస్త్రజ్ఞులు చెప్తున్న సలహా ,వీటి గురించిన విశేషాలు ఈమధ్యన ఇంటర్నెట్ పుణ్యామా అని ఇంటి ఇంటికి వస్తున్నాయి ,మచ్చుకు ఈ చిన్న చిట్కా పాటించడం ద్వారా మీలో ఉన్న ఒత్తిడి నుంచి తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు ...
ఆక్యు ప్రెషర్ అనే ప్రాచీన వైద్య విధానం ,ఎంతో ప్రస్సిద్దమైనది ,ఎన్నో మందులు మింగాల్సిన అవసరం ఉండదు ,ఈ పద్ధతిలో శరీరాన్ని మొత్తం చిన్న చిన్న ఒత్తిడి కేంద్రాలు (ప్రెషర్ పాయింట్స్ ) గా విభజిస్తారు ,ఆ ప్రాంతంలో కొంచం నొప్పిని కలిగించడం ద్వారా ఒత్తిడి నివారించవచ్చు అనేది నిరూపించబడిన సత్యం ...
ఉదాహరణకు మీ చెవినే కనుక తీస్కుంటే అక్కడ అనేక ఒత్తిడి కేంద్రాలు ఉంటాయి ,వాటి మీద సరైన స్తాయిలో ఒత్తిడి కలిగిస్తే ఒత్తిడి మాయమయ్యి కొత్త శక్తి వస్తుంది అని అంటారు ,ఈ ప్రక్రియను "షన్ కిన్ " గా అభివర్ణిస్తారు ...
- ఈ షన్ కిన్ అనే ప్రక్రియ ద్వారా ఒత్తిడి నివారణ ,నొప్పి నుంచి ఉపశమనం ,సమస్యలను ఎదుర్కునే శక్తి వస్తాయి అంటారు .
- పై పటం లో చూపించిన మీ రెండు చెవుల ఆక్యు ప్రెషర్ పాయింట్స్ మీద ,మీ బొటన వేలితో ఒక నిమిషానికి పైగా రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మర్దన చేస్కోవడం ద్వారా ఒత్తిడి తగ్గి ,ఎంతో ఉపసమనం కలుగుతుంది.
- ఈ క్రింది వీడియో మీకు మరింత చక్కగా షన్ కిన్ చేసే విధానం చూపిస్తుంది.
మరిన్ని ఉపయుక్తమైన చిట్కాలు తర్వాతా టపాలో ...
Ref: http://www.omgfacts.com/health/23625/Feeling-Stressed-Or-Run-Down-Acupressure-Says-Try-Pressing-On-This-Point-On-Your-Ear
No comments:
Post a Comment