గత టపాలో చెప్పుకున్నట్లుగానే మన దేశంలో ఇంకా కొన్నిభయానక ప్రదేశాలు ఉన్నాయి ,అవి ఎలా అంటే ,వాటి మీద ఉన్న కథలు ,వాస్తవాలో ,అల్లికలో తెలిదు కానీ ,ఆ ప్రదేశానికి ఉన్న పర్యాటక ప్రాముఖ్యం మాత్రం ఈ కథల వల్ల నష్టపోతుంది అనేది మాత్రం కాదనలేని నిజం ...
ఇక మళ్ళీ విషయానికి వస్తే ...
ఇక మళ్ళీ విషయానికి వస్తే ...
శనివర్వాడ కోట (పూనే):
పూనేలో గల ఈ కోటకి మంచి నిర్మాణ ,ఇంకా చరిత్ర పరమైన ప్రాముఖ్యం ఉంది ,కోటలో హత్య గావించబడిన ఒక రాజకుమారుని ఆర్తనాదం ఇక్కడ అమావాస్య సమయంలో వినిపిస్తుంది అనేది ఇక్కడి స్థానికులు చెపుతున్న మాట ,అందువల్ల ఎవరో కొందరు ఔత్సాహికులు మినహా ,రాత్రి సమయంలో ఈ కోట పరిసరాల్లోకి చేరేటందుకు ఎవరు సాహసించరు ...
డిల్లీ కంట్ (డిల్లీ ) :
మన దేశ రాజధాని డిల్లీ ,కూడా భయానక ప్రదేశాలకు మినహాయింపు కాదు ,ఇక్కడ చుట్టూ పచ్చటి పచ్చికలు ,పొదలు ఉంటాయి ,పగలు ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతం ,రాత్రి వేళ కారులో వెళ్ళే వాళ్ళకి మాత్రం భయాన్ని పరిచయం చేస్తుంది ,తెల్ల చీర కట్టుకున్న ఒక స్త్రీ ,కారు నడిపే వ్యక్తిని ఆపి లిఫ్ట్ అడుగుతుందని ,ఆపకుండా వెళ్తే మాత్రం ,కారు వేగం తో చోదకుడిని ఆ స్త్రీ వెంబడిస్తుంది అనే చెప్తుంటారు ....
డవ్ హిల్ (డార్జిలింగ్ ) :
ఈ ప్రాంతం పర్యాటకానికి ,చక్కటి విద్యా సంస్థలకి పెట్టింది పేరు ,ఇక్కడ ఉన్న బాలికల స్కూల్ సమీపంలో ఎన్నో చిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయని , అంతే కాక ఈ చుట్టూ ప్రక్కన గల అటవీ ప్రాంతంలో కలప నరికే పని వారు ,మొండెం లేకుండా ఒక వ్యక్తి పరిగెట్టడం డిసెంబర్ -మార్చ్ మధ్యలో ప్రతి ఏడాది చూస్తున్నాం అని అంటారు ...
ఇవే కాక ఇంకా ఎన్నో భయానక ప్రదేశాలు మన దేశంలో ఉన్నాయి .
పాశ్చాత్యుల్లో కూడా ఈ తరహా నమ్మకాలు ఎక్కువే ,ఉదాహారణకు 13 సంఖ్య అంటే భయపడే దేశాల సంఖ్యా తక్కువేమీ కాదు .
అమెరికా అధ్యక్షుడి భవనం " వైట్ హౌస్ "లో ప్రతి రాత్రి ,ఆ దేశ మాజీ అధ్యక్షుడు ,సుమారుగా 2 శతాబ్దాల మరణించిన అబ్రహం లింకన్ ఆత్మ
ఆ పరిసరాల్లో తిరుగుతుంది అని చెప్తారు ...
ఇలా దేశం ఏదైనా మనిషిని భయం వెంటాడుతూనే ఉంది ,తను సమస్తాన్ని జయించేసాను అని మిడిసి పడే మనిషి మేధకు ఇవి నిజమైన సవాళ్ళే ...
మరి మన సైన్స్ ఈ సవాళ్ళని చేధించగలదో ,లేదంటే మూఢనమ్మకం అని కొట్టేస్తుందో ,కాలమే సమాధానం చెప్పాలి ....
సశేషం .....
Ref: http://www.thrillophilia.com/blog/most-haunted-places-in-india/
http://wikipedia.org
No comments:
Post a Comment