Saturday, 24 October 2015

ఇక్కడికి వెళ్ళే ధైర్యం ఉందా ?

 
చిన్నప్పుడు అమ్మ ,అన్నం తినకపోయినా ,మాట వినకపోయినా బూచోడికి ఇచ్చేస్తాను అని చెప్తుంది ,మనలో చాల మందికి ధైర్యవంతులం ,అని ఒక భావన ... వయసు పెరిగే కొలదీ ,భయం పోయినా కూడా ,
ఒక్కో సారి ఒంటరి తనం,చీకటి ,నిశబ్దం మనల్ని భయపెట్టినంతగా మరేమీ మనల్ని భయపెట్టలేవు...


మన ధర్మ శాస్త్రాల్లో కూడా వీటి ప్రస్తావన ఉంది ,శంకరాచార్యులు వంటి మహనీయులు చెప్పిన "రజ్జు సర్ప భ్రాంతి " ,ఇటువంటి దే అంటే మనం చీకట్లో నడుస్తూ ఉంటాం ,అనుకోకుండా ఒక చెట్టుకు వేలాడుతూ తాడు కనిపిస్తుంది ,కాకపోతే అది పాము అని మనం భ్రమించి  భయపడతాం ...

నిజానికి వీటిని అన్నిటినీ మూఢ నమ్మకాలుగా కొట్టేయ్యలేము  , సైన్స్ లో మనం గొప్పగా చెప్పుకునే Law OF  Conservation  OF Energy ,శక్తిని మనం సృష్టించలేము ,నాశనం చెయ్యలేము ,కేవలం ఒక రూపం నుంచి మరొక రూపం లోకి మార్చగలం అంతే ... 
... .tx.gov/energy/section_1/topics/law_of_conservation/index.htmlఒక్కో సారి ఊరి అవతల మర్రి చెట్టు ,అర్దరాత్రి కుక్కల అరుపులు ,ఇలా ఎన్నో మనల్ని భయపెడతాయి ,అలానే మన దేశంలో కొన్ని ప్రదేశాలు ఉన్నాయి ,వాటి మీద ఎన్నో కథలు ,మరెన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి ,అటు వంటి వాటిలో మన దేశంలో మచ్చుకు కొన్ని 

    డె మోంటే కాలనీ (చెన్నై) :


ఈ కాలనీ చెన్నైలో ఉంది ,ఇక్కడి చుట్టూ ప్రక్కల చాల పెద్ద పెద్ద హోటల్లు ఉన్నాయి ,గజం కొన్ని లక్షలు  విలువ చేస్తుంది ,అయితే ఈ ప్రాంతం అంటే అందరికీ భయమే ,డె మోంటే అనే పోర్చుగీసు వ్యాపారి ఇక్కడ ఉండేవాడని ,అతను తన భార్య, పిల్లలతో ఆత్మలతో పీడించబడి ఎంతో  భాదాకరమైన జీవితాన్ని ఈ ఇంట్లో గడిపాడు అని ,అతను చనిపోయాక కూడా ఈ ప్రాంతంలో విచిత్రమైన సంఘటనలు జరిగాయి అని చెప్పుకుంటారు ,రాత్రి 7 దాటాక ఈ కాలని లోకి వెళ్ళే సాహసం ఎవరు చేయరు ... 
గత కొంత కాలంగా  ఇక్కడికి స్థానిక ప్రభుత్వం ఈ కాలనీలో మిగిలి ఉన్న కొద్ది ఇల్లని మూసేసి భద్రత కట్టుదిట్టం చేసిన వార్త ఎక్కడో చదివాను .... 
  • భనా ఘర్ కోట (రాజస్థాన్) :
    Bhangarh Fort, Rajasthan
    రాజస్థాన్ ఈ ప్రాంతం పేరు చెప్పగానే మనకి గుర్తొచ్చేవి ,ఎడారి ,ఇంకా పురాతన కోటలు 
    ,
    5 శతాబ్దాలకి పూర్వం "మాధొ సింగ్ " అనే రాజు  ఈ నగరాన్ని కట్టించాడని ,కానీ ఒక శాపం వల్ల ఈ నగరం నివాస యోగ్యం కాకుండా పోయింది అని చెప్పుకుంటారు ,ఇప్పటికీ ఇక్కడ ఏదైనా గృహ నిర్మాణం చేపట్టగానే పైకప్పు కూలిపోతుంది అని చెప్పుకుంటారు .

    Haunted Bhangarh Fort Sign by Government of India
    చీకటి పడ్డ తర్వాత ఈ కోటలోకి ప్రవేశం నిషిద్దం అని భారత పురావస్తు శాఖ వారు ఇక్కడ హెచ్చరికలతో
    బొర్డు లు పెట్టారంటే పరిస్థితిలో తీవ్రత అర్ధం అవుతుంది ... 
  • డ్యూమాస్ బీచ్ (గుజరాత్):

Dumas Beach, Gujarat
గుజరాత్ లోని సూరత్ సమీపంలో గల డ్యూమాస్   సముద్ర తీరం శ్మశాన భూమిగా ప్రసిద్ధం ,ఇక్కడ శవాలను పూడ్చి పెడుతుంటారు స్థానికి హిందూ మతస్తులు ,అయితే ఈ సముద్ర తీరంలో నడిచే వాళ్ళకి అదృశ్య శబ్దాలు వినిపిస్తాయి అని ,ఒక్కో సారి నడుస్తున్న వాళ్ళు అలానే మాయం అయిపోతారని చిత్ర విచిత్ర కథనాలు ప్రచారంలో ఉన్నాయి ...
అయితే స్థానిక యువత ఇదంతా మూఢ నమ్మకం అని కొట్టి పారేస్తుంది ,ఈ ప్రాంతం ఎంతో అందమైనది అని ,కేవలం కొంత మంది పుట్టించిన పూకర్లని నమ్మి పర్యాటక రంగాన్ని దెబ్బ తీయవద్దని వారు వాదిస్తున్నారు ...

లంభీ దేహార్ గనులు (ముస్సొరి):
Lambi Dehar Mines, Mussoorie 
ఈ ప్రాంతంలో ఒకప్పుడు పెద్ద పెద్ద గనులు ఉండేవని ,అయితే ఒకేసారి ఇక్కడ 5 లక్షల పని వాళ్ళు చనిపోయారని ,దానితో ఈ గనులు మూతపడినా ఇక్కడ విచిత్ర సంఘటనలు జరుగుతూ ఉంటాయని ,ముఖ్యంగా అర్ధ రాత్రి సమయంలో ఈ ప్రాంతంలో వెళ్ళే ట్రక్కులు ప్రమాదాలకు గురి అవుతుంటాయి అని స్థానిక కథనం ,ఇక్కడికి దగ్గరలో గల ఒక కొండ మీద ఒక ఆత్మ రూపాన్ని చూసాం అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు...

ఇంకా ఇలాంటి ప్రదేశాలు,మన దేశంలో కోకొల్లలు ,శాస్త్ర సాంకేతిక రంగం ఎంత అభివృద్ధి చెందినా కూడా మనిషికి మేధకు అందనివి ఎన్నో ఎన్నెన్నో ,ఇలాంటివి మరికొన్ని తర్వాత భాగం లో రాయడానికి ప్రయత్నిస్తాను ... ఉంటాను.. ...
గమనిక : ఈ కథనం నేను ఇంటర్నెట్లో చూసి రాసుకున్నది ,ఎటు వంటి మూఢ నమ్మకాలని ప్రోత్సహించే ఉద్దేశం నాకు లేదు ...
References:
  • http://www.speakingtree.in/allslides/most-haunted-places-in-india-460172
  • http://www.shalusharma.com/bhangarh-fort-the-most-haunted-place-in-india/

No comments:

Post a Comment