Tuesday, 3 November 2015

నమ్మలేని మరిన్ని వింతలు ..


వింతలకు కొనసాగింపే తప్ప ,ముగింపు అనేదే లేదు.. 
గత టపాలోని  నమ్మలేని వింతలకు  ఇది ఒక కొనసాగింపు..
1) ఆ ఊరంతే కవలలే  :

         కేరళ రాష్ట్రంలోని కోధిని గ్రామం కవలల గ్రామంగా ప్రసిద్ధికెక్కింది ,ఆ ఊరిలో 250 జతల కవలలు ఉన్నారని అంటారు
2) నీటిపై తేలే పోస్టు ఆఫీసు :
img
source :trending post 

 కాశ్మీర్ లో గల దాల్ సరస్సులో ఈ నీటిపై తేలే పోస్ట్ ఆఫీసు ఉంది ...

3) ప్రపంచంలోనే ఎత్తైన క్రికెట్ మైదానం :
 
హిమాచల్ ప్రదేశ్ లో గల చైల్ క్రికెట్ మైదానం ప్రపంచం అత్యంత ఎత్తు మీద ఉన్న క్రికెట్ మైదానంగా ప్రసిద్ది గాంచింది ,భూమి మీద 2444 మీటర్ల ఎత్తులో నెలకొని ఉంది ...
4) మానవ కంప్యూటర్ :
 
శ్రీమతి శకుంతల దేవి మానవ కంప్యూటర్ గా ప్రసిద్ది గాంచారు ... 7,686,369,774,870 × 2,465,099,745,779 లాంటి సంక్లిష్టమైన లెక్కకు సమాధానం ఇవ్వడానికి ఈమెకు పట్టిన సమయం కేవలం 28 సెకండ్లు ..

5) దోమల మందులు /నివారణ యంత్రాలు :

మీకు తెల్సా ? నిజానికి మనం వాడుతున్న దోమల నివారణ యంత్రాలు ,దోమల్ని చంపలేవు ,కేవలం వాటికి గల సేన్సార్స్ కి మనల్ని అందకుండా చేస్తాయి అంతే ...

6) ఇక్కడ మీ పాద ముద్రలు చెరిగిపొవు .. 

చంద్రుడి  మీద మొట్టమొదటి అడుగు 1969లో పడినా కూడా ఇప్పటికి పదిలంగానే ఉందట ,అక్కడ వాతావరణం,గాలి  లేకపోవడం ఇందుకు కారణాలుగా శాస్త్రజ్ఞులు చెప్తారు ...

మరిన్ని వింతలు తర్వాత టపాలో చూద్దాం ...  సెలవు ...


Sunday, 1 November 2015

నమ్మలేని వింతలు ....

ఈ ప్రపంచం వింతల మయం ,కొన్ని వస్తువులు  చిన్నవిగా అనిపించినా  వాటిలో ఎంతో శక్తి దాగి ఉంటుంది ,ఉదాహరణకు మఱ్ఱి చెట్టు విత్తనం అణువంత ,కానీ దాంట్లోంచి వచ్చే వృక్షం ఆకాశమంత ...
ఇలాంటి ఎన్నో వింతైన విశేషాలు ..

  1. మెదడులో విద్యుత్త్ : సాధారణంగా కనిపించే మన మెదడులో ఆసాధారణమైన శక్తి ఉంటుందట ... 


2. అన్నదాతా సుఖీభవ :కుల మత విచక్షణ లేకుండా అమ్రిత్ సర్ లో గల సిక్కుల స్వర్ణ దేవాలయంలో రోజుకి లక్ష మందికి అన్నదానం చేస్తారట 

3. సమయం చిక్కింది :
ఒక భూకంఫం సమయాన్ని కూడా తగ్గించి వేసింది మరి ... అది ఎక్కడో తెల్సా ?

4. అమ్మో ఇన్ని ప్రమాదాలా ?

5. గజరాజు కి భయమా ?

6. నీటి తో చావులా ?

7. ఇంత వర్షమా ?

ఇలా ఎన్నో వింతలు మన లోకంలో ... మరిన్ని వింతలు ముందు ముందు టపాల్లో చూద్దాం ...
Ref : GOOGLE

Sunday, 25 October 2015

పెద్ద ఒత్తిడికి చిన్న చిట్కా ...


ఒకప్పుడు "ఒత్తిడి" ఇది ఎంతో   పెద్ద  మాట ! పని భారం ఉన్న ఉద్యోగులు ,లేదా పెద్ద  వ్యాపారస్తులు ఇలా ఏ కొద్ది మందికో పరిమితం అనుకునే వాళ్ళం ...

మరి నేటి పరిస్థితో ? 3 ఏళ్ళకే బడికి వెళ్ళిపోయే పిల్లాడి దగ్గరనుంచి ,3 తరాలను చూసేసిన ముదుసలి వరకు అదే ఒత్తిడి చూస్తున్నాం ....ప్రపంచీకరణ తీస్కోస్తున్న సంపద తో పాటు ,ఈ ఒత్తిడి దుష్ఫలితాలు కూడా తీస్కోస్తున్నాయి ,ముఖ్యంగా మనస్తత్వ శాస్త్రజ్ఞులు ఈ క్రింది కారణాలు చెప్తున్నారు ఉద్యోగుల్లో  ఒత్తిడి కోసం ... 

  • ఉద్యోగంతో సంతృప్తి లేకపోవడం 
  • పని భారం 
  • అధిక పని గంటలు 
  • ప్రణాళిక లేకపోవడం 
  • పని చేసే సంస్థ నుంచి సహకారం లేకపోవడం
ఇక విద్యార్ధుల్లో ఒత్తిడి సంగతి చెప్పనే అక్కర్లేదు ,ర్యాంకుల కోసం పెద్దల ఒత్తిడి ,ప్రాణాలు తీసిన సందర్భాలు ఎన్నో ... 
ఇలా విద్య ,ఉద్యోగం ,వ్యాపారం ఇలా రంగం ఏదైనా ఈ ఒత్తిడి అనేది ఒక మహమ్మారిగా పరిణమించింది ,కాకపోతే చిన్న చిన్న చిట్కాల ద్వారా అధిగమించవచ్చు అనేది శాస్త్రజ్ఞులు చెప్తున్న సలహా ,వీటి గురించిన విశేషాలు ఈమధ్యన  ఇంటర్నెట్ పుణ్యామా అని ఇంటి ఇంటికి వస్తున్నాయి ,మచ్చుకు ఈ చిన్న చిట్కా పాటించడం ద్వారా మీలో ఉన్న ఒత్తిడి నుంచి తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు ... 




ఆక్యు ప్రెషర్ అనే ప్రాచీన వైద్య విధానం ,ఎంతో ప్రస్సిద్దమైనది ,ఎన్నో మందులు మింగాల్సిన  అవసరం ఉండదు ,ఈ పద్ధతిలో శరీరాన్ని మొత్తం చిన్న చిన్న ఒత్తిడి కేంద్రాలు (ప్రెషర్ పాయింట్స్ ) గా విభజిస్తారు ,ఆ ప్రాంతంలో కొంచం నొప్పిని కలిగించడం ద్వారా ఒత్తిడి నివారించవచ్చు అనేది నిరూపించబడిన సత్యం ... 
ఉదాహరణకు మీ చెవినే కనుక తీస్కుంటే అక్కడ అనేక ఒత్తిడి కేంద్రాలు ఉంటాయి ,వాటి మీద సరైన స్తాయిలో ఒత్తిడి కలిగిస్తే ఒత్తిడి మాయమయ్యి కొత్త శక్తి వస్తుంది అని అంటారు ,ఈ ప్రక్రియను "షన్ కిన్ " గా అభివర్ణిస్తారు ... 


  • ఈ షన్ కిన్ అనే ప్రక్రియ ద్వారా ఒత్తిడి నివారణ ,నొప్పి నుంచి ఉపశమనం ,సమస్యలను ఎదుర్కునే శక్తి వస్తాయి అంటారు . 
  • పై పటం లో చూపించిన మీ రెండు చెవుల ఆక్యు ప్రెషర్ పాయింట్స్ మీద ,మీ బొటన వేలితో ఒక నిమిషానికి పైగా రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మర్దన చేస్కోవడం ద్వారా ఒత్తిడి తగ్గి ,ఎంతో ఉపసమనం కలుగుతుంది. 
  • ఈ క్రింది వీడియో మీకు మరింత చక్కగా షన్ కిన్  చేసే విధానం చూపిస్తుంది. 


మరిన్ని ఉపయుక్తమైన చిట్కాలు తర్వాతా టపాలో ..
Ref: http://www.omgfacts.com/health/23625/Feeling-Stressed-Or-Run-Down-Acupressure-Says-Try-Pressing-On-This-Point-On-Your-Ear

ఇక్కడికి వెళ్ళగలరా --2?

గత టపాలో చెప్పుకున్నట్లుగానే మన దేశంలో ఇంకా కొన్నిభయానక  ప్రదేశాలు ఉన్నాయి ,అవి ఎలా అంటే ,వాటి మీద ఉన్న కథలు ,వాస్తవాలో ,అల్లికలో తెలిదు కానీ ,ఆ ప్రదేశానికి ఉన్న పర్యాటక ప్రాముఖ్యం మాత్రం ఈ కథల వల్ల నష్టపోతుంది అనేది మాత్రం కాదనలేని నిజం ... 
ఇక  మళ్ళీ విషయానికి వస్తే ... 

శనివర్వాడ కోట (పూనే):












పూనేలో గల ఈ కోటకి మంచి నిర్మాణ ,ఇంకా చరిత్ర పరమైన ప్రాముఖ్యం ఉంది ,కోటలో హత్య గావించబడిన ఒక రాజకుమారుని ఆర్తనాదం ఇక్కడ అమావాస్య సమయంలో వినిపిస్తుంది అనేది ఇక్కడి స్థానికులు చెపుతున్న మాట ,అందువల్ల ఎవరో కొందరు ఔత్సాహికులు మినహా ,రాత్రి సమయంలో ఈ కోట పరిసరాల్లోకి చేరేటందుకు ఎవరు సాహసించరు ... 
 

డిల్లీ కంట్ (డిల్లీ )  :















మన దేశ రాజధాని డిల్లీ ,కూడా భయానక ప్రదేశాలకు మినహాయింపు కాదు ,ఇక్కడ చుట్టూ పచ్చటి పచ్చికలు ,పొదలు ఉంటాయి ,పగలు ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతం ,రాత్రి వేళ కారులో వెళ్ళే వాళ్ళకి మాత్రం భయాన్ని పరిచయం చేస్తుంది ,తెల్ల చీర కట్టుకున్న ఒక స్త్రీ ,కారు నడిపే వ్యక్తిని ఆపి లిఫ్ట్ అడుగుతుందని ,ఆపకుండా వెళ్తే మాత్రం ,కారు వేగం తో చోదకుడిని ఆ స్త్రీ వెంబడిస్తుంది అనే చెప్తుంటారు .... 

డవ్  హిల్ (డార్జిలింగ్  )  :















ఈ ప్రాంతం పర్యాటకానికి ,చక్కటి విద్యా సంస్థలకి పెట్టింది పేరు ,ఇక్కడ ఉన్న బాలికల స్కూల్ సమీపంలో ఎన్నో చిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయని , అంతే కాక ఈ చుట్టూ ప్రక్కన  గల అటవీ ప్రాంతంలో కలప నరికే  పని వారు ,మొండెం లేకుండా ఒక వ్యక్తి పరిగెట్టడం డిసెంబర్ -మార్చ్ మధ్యలో ప్రతి ఏడాది చూస్తున్నాం అని అంటారు ... 
ఇవే కాక ఇంకా ఎన్నో భయానక ప్రదేశాలు మన దేశంలో ఉన్నాయి . 
పాశ్చాత్యుల్లో  కూడా ఈ తరహా నమ్మకాలు ఎక్కువే ,ఉదాహారణకు 13 సంఖ్య  అంటే భయపడే దేశాల సంఖ్యా తక్కువేమీ కాదు . 

అమెరికా అధ్యక్షుడి భవనం " వైట్ హౌస్ "లో ప్రతి రాత్రి ,ఆ దేశ మాజీ అధ్యక్షుడు  ,సుమారుగా 2 శతాబ్దాల  మరణించిన అబ్రహం లింకన్  ఆత్మ 
ఆ పరిసరాల్లో తిరుగుతుంది అని చెప్తారు ... 

ఇలా దేశం ఏదైనా మనిషిని భయం వెంటాడుతూనే ఉంది ,తను సమస్తాన్ని జయించేసాను అని మిడిసి పడే మనిషి మేధకు ఇవి నిజమైన సవాళ్ళే ... 
మరి మన సైన్స్ ఈ సవాళ్ళని చేధించగలదో ,లేదంటే మూఢనమ్మకం అని కొట్టేస్తుందో ,కాలమే సమాధానం  చెప్పాలి .... 

సశేషం ..... 
Ref: http://www.thrillophilia.com/blog/most-haunted-places-in-india/
         http://wikipedia.org

Saturday, 24 October 2015

ఇక్కడికి వెళ్ళే ధైర్యం ఉందా ?

 
చిన్నప్పుడు అమ్మ ,అన్నం తినకపోయినా ,మాట వినకపోయినా బూచోడికి ఇచ్చేస్తాను అని చెప్తుంది ,మనలో చాల మందికి ధైర్యవంతులం ,అని ఒక భావన ... వయసు పెరిగే కొలదీ ,భయం పోయినా కూడా ,
ఒక్కో సారి ఒంటరి తనం,చీకటి ,నిశబ్దం మనల్ని భయపెట్టినంతగా మరేమీ మనల్ని భయపెట్టలేవు...


మన ధర్మ శాస్త్రాల్లో కూడా వీటి ప్రస్తావన ఉంది ,శంకరాచార్యులు వంటి మహనీయులు చెప్పిన "రజ్జు సర్ప భ్రాంతి " ,ఇటువంటి దే అంటే మనం చీకట్లో నడుస్తూ ఉంటాం ,అనుకోకుండా ఒక చెట్టుకు వేలాడుతూ తాడు కనిపిస్తుంది ,కాకపోతే అది పాము అని మనం భ్రమించి  భయపడతాం ...

నిజానికి వీటిని అన్నిటినీ మూఢ నమ్మకాలుగా కొట్టేయ్యలేము  , సైన్స్ లో మనం గొప్పగా చెప్పుకునే Law OF  Conservation  OF Energy ,శక్తిని మనం సృష్టించలేము ,నాశనం చెయ్యలేము ,కేవలం ఒక రూపం నుంచి మరొక రూపం లోకి మార్చగలం అంతే ... 
... .tx.gov/energy/section_1/topics/law_of_conservation/index.htmlఒక్కో సారి ఊరి అవతల మర్రి చెట్టు ,అర్దరాత్రి కుక్కల అరుపులు ,ఇలా ఎన్నో మనల్ని భయపెడతాయి ,అలానే మన దేశంలో కొన్ని ప్రదేశాలు ఉన్నాయి ,వాటి మీద ఎన్నో కథలు ,మరెన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి ,అటు వంటి వాటిలో మన దేశంలో మచ్చుకు కొన్ని 

    డె మోంటే కాలనీ (చెన్నై) :


ఈ కాలనీ చెన్నైలో ఉంది ,ఇక్కడి చుట్టూ ప్రక్కల చాల పెద్ద పెద్ద హోటల్లు ఉన్నాయి ,గజం కొన్ని లక్షలు  విలువ చేస్తుంది ,అయితే ఈ ప్రాంతం అంటే అందరికీ భయమే ,డె మోంటే అనే పోర్చుగీసు వ్యాపారి ఇక్కడ ఉండేవాడని ,అతను తన భార్య, పిల్లలతో ఆత్మలతో పీడించబడి ఎంతో  భాదాకరమైన జీవితాన్ని ఈ ఇంట్లో గడిపాడు అని ,అతను చనిపోయాక కూడా ఈ ప్రాంతంలో విచిత్రమైన సంఘటనలు జరిగాయి అని చెప్పుకుంటారు ,రాత్రి 7 దాటాక ఈ కాలని లోకి వెళ్ళే సాహసం ఎవరు చేయరు ... 
గత కొంత కాలంగా  ఇక్కడికి స్థానిక ప్రభుత్వం ఈ కాలనీలో మిగిలి ఉన్న కొద్ది ఇల్లని మూసేసి భద్రత కట్టుదిట్టం చేసిన వార్త ఎక్కడో చదివాను .... 
  • భనా ఘర్ కోట (రాజస్థాన్) :
    Bhangarh Fort, Rajasthan
    రాజస్థాన్ ఈ ప్రాంతం పేరు చెప్పగానే మనకి గుర్తొచ్చేవి ,ఎడారి ,ఇంకా పురాతన కోటలు 
    ,
    5 శతాబ్దాలకి పూర్వం "మాధొ సింగ్ " అనే రాజు  ఈ నగరాన్ని కట్టించాడని ,కానీ ఒక శాపం వల్ల ఈ నగరం నివాస యోగ్యం కాకుండా పోయింది అని చెప్పుకుంటారు ,ఇప్పటికీ ఇక్కడ ఏదైనా గృహ నిర్మాణం చేపట్టగానే పైకప్పు కూలిపోతుంది అని చెప్పుకుంటారు .

    Haunted Bhangarh Fort Sign by Government of India
    చీకటి పడ్డ తర్వాత ఈ కోటలోకి ప్రవేశం నిషిద్దం అని భారత పురావస్తు శాఖ వారు ఇక్కడ హెచ్చరికలతో
    బొర్డు లు పెట్టారంటే పరిస్థితిలో తీవ్రత అర్ధం అవుతుంది ... 
  • డ్యూమాస్ బీచ్ (గుజరాత్):

Dumas Beach, Gujarat
గుజరాత్ లోని సూరత్ సమీపంలో గల డ్యూమాస్   సముద్ర తీరం శ్మశాన భూమిగా ప్రసిద్ధం ,ఇక్కడ శవాలను పూడ్చి పెడుతుంటారు స్థానికి హిందూ మతస్తులు ,అయితే ఈ సముద్ర తీరంలో నడిచే వాళ్ళకి అదృశ్య శబ్దాలు వినిపిస్తాయి అని ,ఒక్కో సారి నడుస్తున్న వాళ్ళు అలానే మాయం అయిపోతారని చిత్ర విచిత్ర కథనాలు ప్రచారంలో ఉన్నాయి ...
అయితే స్థానిక యువత ఇదంతా మూఢ నమ్మకం అని కొట్టి పారేస్తుంది ,ఈ ప్రాంతం ఎంతో అందమైనది అని ,కేవలం కొంత మంది పుట్టించిన పూకర్లని నమ్మి పర్యాటక రంగాన్ని దెబ్బ తీయవద్దని వారు వాదిస్తున్నారు ...

లంభీ దేహార్ గనులు (ముస్సొరి):
Lambi Dehar Mines, Mussoorie 
ఈ ప్రాంతంలో ఒకప్పుడు పెద్ద పెద్ద గనులు ఉండేవని ,అయితే ఒకేసారి ఇక్కడ 5 లక్షల పని వాళ్ళు చనిపోయారని ,దానితో ఈ గనులు మూతపడినా ఇక్కడ విచిత్ర సంఘటనలు జరుగుతూ ఉంటాయని ,ముఖ్యంగా అర్ధ రాత్రి సమయంలో ఈ ప్రాంతంలో వెళ్ళే ట్రక్కులు ప్రమాదాలకు గురి అవుతుంటాయి అని స్థానిక కథనం ,ఇక్కడికి దగ్గరలో గల ఒక కొండ మీద ఒక ఆత్మ రూపాన్ని చూసాం అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు...

ఇంకా ఇలాంటి ప్రదేశాలు,మన దేశంలో కోకొల్లలు ,శాస్త్ర సాంకేతిక రంగం ఎంత అభివృద్ధి చెందినా కూడా మనిషికి మేధకు అందనివి ఎన్నో ఎన్నెన్నో ,ఇలాంటివి మరికొన్ని తర్వాత భాగం లో రాయడానికి ప్రయత్నిస్తాను ... ఉంటాను.. ...
గమనిక : ఈ కథనం నేను ఇంటర్నెట్లో చూసి రాసుకున్నది ,ఎటు వంటి మూఢ నమ్మకాలని ప్రోత్సహించే ఉద్దేశం నాకు లేదు ...
References:
  • http://www.speakingtree.in/allslides/most-haunted-places-in-india-460172
  • http://www.shalusharma.com/bhangarh-fort-the-most-haunted-place-in-india/